ఇంత ఎక్స్‌పోజింగ్ అవసరమా.. షమీ భార్య పై ట్రోల్స్...!
మరోసారి వార్తల్లోకి ఎక్కారు టీంఇండియా క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్... గతంలో తన భర్త షమీ పైన సంచలన ఆరోపణలు చేసి వార్తల్లోకి ఎక్కింది;
మరోసారి వార్తల్లోకి ఎక్కారు టీంఇండియా క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్... గతంలో తన భర్త షమీ పైన సంచలన ఆరోపణలు చేసి వార్తల్లోకి ఎక్కింది హసీన్. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే ఈమెను తాజాగా నెటిజన్లు ఫుల్ ట్రోల్ చేస్తున్నారు. హసీన్ బుధవారం ఇన్‌స్టాలో ఓ బోల్డ్ ఫోటో షేర్ చేశారు.
ఈ ఫోటోలో ఆమె తెలుపు రంగు రగ్గడ్ జీన్స్, బ్లాక్ టాప్ ధరించి ఉన్నారు. ఈ ఫోటో వైరల్ అవ్వడంతో కొందరు మెచ్చుకోగా మరికొందరు దారుణంగా ట్రోల్ చేశారు. పెళ్లై ఓ బిడ్డకు తల్లివి మీరు.. ఇప్పుడు కూడా ఇంత ఎక్స్‌పోజింగ్ అవసరమా అంటూ మండిపడుతున్నారు.
కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో హసీన్ జహాన్‌కు లక్షమందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. కాగా తన భర్తకి గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు హసీన్ వ్యక్తిగత కారణాల వల్ల విడివిడిగా ఉంటున్నప్పటికీ విడాకులు మాత్రం తీసుకోలేదు.
కోల్‌కతాకు చెందిన హసీన్ జహాన్, షమీ 2014, ఏప్రిల్ 7 న వివాహం చేసుకున్నారు.