నాయకుడిగా జట్టును విజయవంతంగా ముందుండి నడిపించడం అందరి వల్ల సాధ్యం కాదు. పరిస్థితులకు తగ్గట్టుగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ వాటిని సరిగ్గా అమలు చేయడం సవాలుతో కూడుకున్నది. అందుకే ఎంతోమంది స్టార్ ఆటగాళ్లు కెప్టెన్సీ చేపట్టినా సక్సెస్ కాలేకపోయారు. ఈ నేపథ్యంలో టీమిండియాలో అత్యుత్తమ కెప్టెన్ ఎవరో వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ వెల్లడించాడు. అతడు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని అత్యుత్తమ సారథిగా ఎంపిక చేశాడు. అతడిని ట్రెండ్ సెట్టర్‌గా పేర్కొన్నాడు. ఇక, ధోనీ కెప్టెన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడి సారథ్యంలో ద్వైపాక్షిక సిరీస్‌ల్లో సత్తాచాటిన టీమ్‌ఇండియా.. మూడు ఐసీసీ ట్రోఫీలూ సాధించిన సంగతి తెలిసిందే. ‘భారత జట్టులో మోస్ట్ సక్సెస్‌పుల్ కెప్టెన్ ధోనీ. అతడు కెప్టెన్సీపరంగా ఓ ట్రెండ్ సెట్ చేశాడు. రోహిత్ శర్మ కూడా జట్టును అద్భుతంగా ముందుండి నడిపిస్తున్నాడు. విరాట్ కోహ్లీ కూడా కెప్టెన్సీ బాగా చేశాడు’ అని క్రిస్ గేల్ పేర్కొన్నాడు.