Russell : విండీస్ విధ్వంసం రిటైర్‌మెంట్.. చివరి మ్యాచ్‌లో రెచ్చపోయిన రస్సేల్

Update: 2025-07-23 08:15 GMT

వెస్టిండీస్ విధ్వంస‌క‌ర‌ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ గతంలోనే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో.. రెండో టీ20 తర్వాత ఆటకు వీడ్కోలు పలుకుతానని అప్పుడు చెప్పాడు. ఇవాళ ఆస్ట్రేలియాతో జ‌రిగిన రెండో టీ20 ఆడిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సంద‌ర్భంగా ఇరు జ‌ట్ల ఆట‌గాళ్లు ర‌స్సెల్‌కు గార్డ్ ఆఫ్ హాన‌ర్ ఇచ్చారు. ఈ మ్యాచ్ రస్సేల్ రెచ్చిపోయాడు. 15 బంతుల్లో 4సిక్సర్లతో 36 రన్స్ చేశాడు. దీంతో విండీస్ టీమ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 172 ప‌రుగులు చేసింది. కానీ ఈ మ్యాచ్‌లో ఆసీస్ గెలిచింది.

2019 నుంచి రస్సెల్ టీ20 స్సెషలిస్ట్ ప్లేయర్‌గా ఉన్నాడు. అతను విండీస్‌ తరపున 84 టీ20లు ఆడాడు. 22.00 సగటుతో 1,078 రన్స్ చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత‌ని అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరు 71. అలాగే ర‌స్సెల్‌ 30.59 సగటుతో 61 వికెట్లు కూడా పడగొట్టాడు. కాగా రస్సెల్ వెస్టిండీస్ తరఫున ఒకే ఒక టెస్ట్, 56 వన్డేలు ఆడాడు. వీటిలో 27.21 సగటుతో 1,034 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధ శ‌త‌కాలు ఉన్నాయి. వన్డేల్లో అతను 70 వికెట్లు పడగొట్టాడు. ఇక‌, రస్సెల్ అనేక టీ20 లీగ్‌లలో ఆడాడు. మొత్తంగా 561 మ్యాచ్‌ల్లో 168 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 9,316 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Tags:    

Similar News