ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఘోరంగా విఫలమైన పాకిస్తాన్ జట్టుపై మాజీల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెలువెత్తాయి. దీంతో వరుసగా చెత్త ప్రదర్శనలు చేస్తున్న టీమ్పై పాక్ క్రికెట్ బోర్డు ప్రక్షాళన చర్యలకు దిగింది. ఈ నేపథ్యంలో ఆ జట్టు సారథి మహ్మద్ రిజ్వాన్, మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్పై వేటు వేసింది. మార్చి 16 నుంచి పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ పాక్ ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లు ఆడనుంది. అయితే ఈ సిరీస్ల కోసం పీసీబీ రెండు వేరువేరు జట్లను ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా ముందు జరిగే పొట్టి సిరీస్ లో సీనియర్ ఆటగాళ్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్లకు అవకాశం ఇవ్వలేదు. రిజ్వాన్ స్థానంలో ఆల్రౌండర్ సల్మాన్ ఆఘాను కొత్త సారథిగా ఎంపిక చేసింది. అయితే, వన్డే సిరీస్లో మాత్రం వీరిద్దరికి చోటు ఇచ్చారు. వన్డే జట్టుకు మాత్రం రిజ్వాన్ కెప్టెన్ గా కొనసాగుతాడని పీసీబీ వెల్లడించింది. కాగా, టీ20 సిరీస్ మార్చి 16 నుంచి 26 వరకు.. వన్డే సిరీస్ మార్చి 29 నుంచి ఏప్రిల్ 5 వరకు జరగనుంది.