యువరాజ్ సింగ్ ఇంటర్నేషనల్ కెరీర్ ముగియడానికి కోహ్లీనే కారణమని మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప సంచలన కామెంట్స్ చేశారు. ‘క్యాన్సర్ నుంచి కోలుకున్నాక యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావాలనుకున్నాడు. అప్పటి కెప్టెన్ కోహ్లీ ప్లేయర్ల ఫిట్‌నెస్, ఆహారపు అలవాట్లకు పెద్దపీట వేసేవాడు. అందరూ తనలాగే ఉండాలనుకునేవాడు. 2 WCలు గెలిచిన, క్యాన్సర్ నుంచి కోలుకుని వచ్చిన యువీకి టైమ్ ఇవ్వలేదు’ అని తెలిపారు. కాగా 2000లో టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన యువరాజ్.. తన కెరీర్‌లో మొత్తంగా 402 మ్యాచ్‌లు ఆడాడు. 402 మ్యాచ్‌ల్లో ఈ పంజాబ్ ఆటగాడు 11,778 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు ఉన్నాయి. 2007, 2011 వన్డే ప్రపంచకప్‌లను భారత్ సొంతం చేసుకోవడంలో యువీది కీలక పాత్ర. 19 సంవత్సరాల పాటు భారత క్రికెట్ కి ఎన్నో సేవలు అందించాడు. ఇక 37 ఏళ్ల వయసులో తన రిటైర్మెంట్ ని ప్రకటించాడు.