Rohit Sharma : రోహిత్.. హ్యాట్సాఫ్: మంజ్రేకర్

Update: 2025-01-04 16:32 GMT

రోహిత్ శర్మ తాను ఫామ్‌లో లేనని ఒప్పుకోవడాన్ని కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కొనియాడారు. ‘హ్యాట్సాఫ్ రోహిత్. మరీ ఎక్కువమంది ఫామ్ లేని ఆటగాళ్లు సిడ్నీ టెస్టులో ఆడటం మంచిది కాదని తాను తప్పుకున్నానన్నారు. ఇంటర్వ్యూలో అత్యంత నిజాయితీతో మాట్లాడారు’ అని ట్వీట్ చేశారు. కాగా.. తనకు రిటైర్మెంట్ ఆలోచన లేదని, ఈ మ్యాచ్‌కు మాత్రం తానే తప్పుకొన్నానని రోహిత్ ఇంటర్వ్యూలో తెలిపిన సంగతి తెలిసిందే.

టెస్టుల నుంచి రిటైర్ అవ్వట్లేదని కెప్టెన్ రోహిత్ ప్రకటించడంతో హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 5వ టెస్టు ముందు రోజు నుంచి జట్టులో చోటు చేసుకున్న పరిణామాలు, మ్యాచ్‌కు దూరం కావడంతో రిటైర్ ఊహాగానాలు వ్యాప్తి చెందాయి. దీంతో రోహిత్ ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. అనుమానాలన్నింటికీ తెరదించుతూ తాను రిటైర్ అవ్వట్లేదని, ఫామ్‌లో లేని కారణంగా తాత్కాలికంగా తప్పుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News