ROHIT: రోహిత్ శర్మకు రాహుల్ ద్రవిడ్ మెసేజ్
టికెట్లు ఎవరినీ అడగాలో నాకు తెలుసు;
ముంబైలోని వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ పేరుతో కొత్త స్టాండ్ ప్రారంభమైంది. టీమిండియాతో పాటు ముంబై క్రికెట్‌కు రోహిత్ అందించిన సేవలకు గానూ ముంబై క్రికెట్ అసోసియేషన్ వాంఖడే స్టేడియంలో ఓ స్టాండ్‌కు అతడి పేరును పెట్టి గౌరవించింది. ఈ కార్యక్రమానికి రోహిత్ శర్మ తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యాడు. వాంఖడే స్టేడియంలో ఓ స్టాండ్‌కు రోహిత్ పేరు పెట్టడంపై టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. " హే రోహిత్.. ఈ గౌరవానికి నీవు పూర్తిగా అర్హుడివి. వాంఖడే స్టేడియంలోని స్టాండ్స్‌లోకి నువ్వు ఎన్నో సిక్స్‌లు కొట్టావు. అందుకే ఈ రోజు నీ పేరుతో ఆ స్టేడియంలో ఓ స్టాండ్ వచ్చింది. భారత క్రికెట్, ముంబై జట్టుకు నీవు అందించిన సేవలకు దక్కిన రివార్డ్ ఇది. నీకు, నీ కుటుంబ సభ్యులకు ఇది ఎంతో అద్భుతమైన క్షణం. ఈ స్టేడియంలో నువ్వు మరిన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాలని కోరుకుంటున్నా. వాంఖడే స్టేడియం టిక్కెట్లు నాకు కావాల్సి వస్తే ఇప్పుడు ఎవరిని అడగాలో నాకు తెలుసు" అంటూ ద్రవిడ్ వ్యాఖ్యానించాడు.