Rohit Sharma : రోహిత్ శర్మ చెత్త రికార్డు..!
Rohit Sharma : ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ కొనసాగుతోంది.;
Rohit Sharma : ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ కొనసాగుతోంది. తాజాగా రోహిత్ శర్మ చెత్త రికార్డుని మూటగట్టుకున్నాడు.. ఇవ్వాళ చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రెండో బంతికి డక్ అవుట్ అయ్యాడు.
దీనితో ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 14 సార్లు డక్ అవుట్ అయిన ప్లేయర్ గా నిలిచాడు. రోహిత్ తర్వాత అజింక్యా రహానే, పార్థివ్ షా, అంబటి రాయుడు, మన్‌దీప్ సింగ్, హర్భజన్ సింగ్, పీయూష్ చావ్లాలు ఒక్కొక్కరు 13 మంది డకౌట్‌లతో ఉన్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం ముంబయి పది ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. క్రీజ్‌లో తిలక్ వర్మ (15*), హృతిక్ షోకీన్ (4*) ఉన్నారు.