Rohit Sharma : హిట్ మ్యాన్ గ్యారేజీలోకి కొత్త కారు.. దాని ధర తెలిస్తే షాకే.
Rohit Sharma : క్రికెట్ మైదానంలో తన పవర్ఫుల్ షాట్లతో అభిమానుల మనసు దోచుకునే రోహిత్ శర్మ ఇప్పుడు రోడ్లపైనా తన కొత్త టెస్లా మోడల్ వైతో మెరవబోతున్నారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతన్న ప్రజాదరణ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ కూడా ఈ దిశగా అడుగు వేశారు. ఆయన ఇటీవల టెస్లా మోడల్ వై ఆర్‌డబ్ల్యూడీ స్టాండర్డ్ రేంజ్ వేరియంట్‌ను కొనుగోలు చేశారు. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.67.89 లక్షలుగా ఉంది.
రోహిత్ శర్మ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 75 కేడబ్ల్యూహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 622 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. ఇది రియర్-వీల్ డ్రైవ్ సిస్టమ్ పై ఆధారపడి పనిచేస్తుంది. దీని మోటార్ 220 కేడబ్ల్యూ ఎనర్జీని ఇస్తుంది. ఇది 295 బీహెచ్‌పీ సామర్థ్యాన్ని, 420 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
టెస్లా మోడల్ వై డిజైన్ చాలా ఆధునికంగా ఉంటుంది. ఇందులో 15.4 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రీమియం ఇంటీరియర్, ఆల్-ఎల్‌ఈడీ లైట్లు, వెంటిలేటెడ్ సీట్లు, స్పెషల్ లైటింగ్, 9-స్పీకర్ల ప్రీమియం సౌండ్ సిస్టమ్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు ఆటోమేటిక్ అత్యవసర బ్రేకింగ్, బ్లైండ్ కొలిజన్ అలర్ట్, గ్లాస్ రూఫ్ వంటి సేఫ్టీ అంశాలు ఈ కారును మరింత స్పెషల్ గా మారుస్తాయి.
రోహిత్ శర్మ కొత్త టెస్లా కారు నంబర్ ప్లేట్ 3015. ఈ నంబర్‌కు ఆయన కుటుంబంతో చాలా లోతైన సంబంధం ఉంది. ఇందులో 30 అనేది డిసెంబర్ 30, కూతురి పుట్టినరోజు కాగా.. 15 అనేది నవంబర్ 15 కుమారుడి పుట్టినరోజు. ఈ విధంగా తన పిల్లల పుట్టిన తేదీలను నంబర్ ప్లేట్‌పై పెట్టించుకోవడం ద్వారా రోహిత్ తన భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు.
రోహిత్ శర్మ విలాసవంతమైన కార్లు కొనడం ఇదే మొదటిసారి కాదు. ఆయన గ్యారేజ్ ఇప్పటికే అనేక సూపర్‌కార్లతో నిండి ఉంది. రోహిత్ వద్ద లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌ఈ, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ హెచ్ఎస్‌ఈ లాంగ్ వీల్‌బేస్, మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్, జీఎల్ఎస్ 400డీ, బీఎమ్‌డబ్ల్యూ ఎం5, స్కోడా ఆక్టేవియా, టయోటా ఫార్చ్యూనర్ వంటి అద్భుతమైన కార్లు ఉన్నాయి.