Rohit Sharma : రోహిత్ శర్మకు అరుదైన గౌరవం!

Update: 2025-04-09 06:30 GMT

భారత కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రతిష్ఠాత్మక వాంఖడే స్టేడియంలో స్టాండ్స్, వాకింగ్ బ్రిడ్జిలకు ప్రముఖ ముంబై క్రికెటర్ల పేర్లు పెట్టాలని ముంబై క్రికెట్ అసోసియేషన్(MCA) భావిస్తోంది. ఓ స్టాండ్‌‌కు రోహిత్ శర్మ పేరిట నామకరణం చేయనున్నట్లు సమాచారం. మాజీ ప్లేయర్స్ అజిత్ వాడేకర్, ఏక్‌నాథ్ సోల్కర్, శివాల్కర్, డయానా ఎడుల్జీ తదితరుల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్‌లో పాల్గొంటున్నాడు. అయితే రోహిత్ పేలవమైన ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌లలో రోహిత్ శర్మ ఫామ్ అంత గొప్పగా ఏమీ లేదు. రోహిత్ శర్మ పేలవమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ ప్రత్యేక గౌరవం పొందబోతున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ రోహిత్‌కు ప్రత్యేక బహుమతి ఇవ్వబోతోంది.

2023 నవంబర్​లోనే ముంబయి క్రికెట్ అసోసియేషన్ సచిన్‌ లైఫ్​ టైమ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. నార్త్​ గ్యాలరీకి సమీపంలో 22 అడుగుల ఎత్తుగల విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. సచిన్ యాభై ఏళ్ల జీవితానికి నిదర్శనంగా ముంబయి అసోసియేషన్ ఈ విగ్రహాన్ని స్టేడియంలో ఉంచింది.

Tags:    

Similar News