Darren Sammy : వెస్టిండీస్ ఆల్ ఫార్మాట్ హెడ్ కోచ్‌గా సామీ

Update: 2024-12-18 06:30 GMT

వెస్టిండీస్ ఆల్ ఫార్మాట్ హెడ్ కోచ్‌గా ఆ దేశ మాజీ క్రికెటర్ డారెన్ సామీ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన వన్డే, టీ20లకు హెడ్ కోచ్‌గా ఉన్నారు. తాజాగా టెస్టులకు కూడా సామీ కోచ్‌గా నియమితులయ్యారు. వచ్చే ఏప్రిల్‌ నుంచి సామీ టెస్టు టీమ్‌కి తన సేవలందిస్తారు. కాగా సామీ సారథ్యంలోనే విండీస్‌కు రెండు టీ20 వరల్డ్ కప్ లు వచ్చాయి. 2023 వన్డే వరల్డ్ కప్‌కు విండీస్ అర్హత సాధించకపోవడంతో విండీస్ బోర్డు ఆయనను కోచ్‌గా నియమించింది . విండీస్ వైట్‌బాల్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తమ జట్టుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతడి నేతృత్వంలో విండీస్‌ మెరుగైన ఫలితాలు సాధిస్తోంది.

Tags:    

Similar News