టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయర్ అయ్యర్ బ్యాడ్ టైమ్ నడుస్తోంది. దులీప్ ట్రోఫీలో బ్యాటింగ్‌కి దిగుతూ చేసిన ఓ పనితో విపరీతంగా ట్రోల్ అవుతున్నాడు. ఇంతకీ అయ్యర్ ఏం చేశాడంటే.. దులీప్ ట్రోఫీ రెండవ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కి దిగిన అయ్యర్.. ఒక్క రన్ కూడా చేయకుండానే డకౌట్‌గా పెవిలియన్‌కి వెళ్లిపోయాడు. కానీ ఇక్కడ సమస్య అయ్యర్ డకౌట్ కావడం కాదు.. అతడు బ్యాటింగ్‌కి వచ్చిన స్టైల్. సాధారణంగా బ్యాటింగ్‌కి వచ్చేటప్పుడు ప్రతి ప్లేయర్ ప్యాడ్లు, గ్లౌజ్‌లు తొడుక్కుని హెల్మెట్ పెట్టుకుని వస్తాడు. కానీ అయ్యర్ మాత్రం వీటికి అదనంగా ఓ స్టైలిష్ బ్లాక్ సన్‌గస్లాసెస్ పెట్టుకుని బ్యాటింగ్‌కి దిగాడు. క్యాచ్‌లు పట్టేటప్పుడు, బౌండరీలను ఆపేటప్పుడు కళ్లలో సూర్యుడు పడకుండా ఫీల్డర్లు సన్‌గ్లాసెస్ వాడుతుంటారు. కానీ సన్ గ్లాసెస్ పెట్టుకుని క్రీజులోకి వచ్చిన అయ్యర్ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. 7 బంతులాడి ఒక్క రన్ కూడా కొట్టకుండా డకౌట్ అయి వెనక్కి వెళ్లిపోయాడు. దీంతో ఫ్యాన్స్‌కి చిర్రెత్తుకుపోయింది. ‘‘అంతెందుకయ్యా అయ్యర్.. అవసరమా మనకి ఇదంతా..?’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇంకొంతమందైతే బ్యాటింగ్ రాదు కానీ.. స్టైల్ మాత్రం కావాల్సొచ్చిందా..?’’ అంటూ తిట్టిపోస్తున్నారు.దులీప్ ట్రోఫీ రెండో మ్యాచ్‌లో కూడా ఘోరంగా విఫలం కావడంతో ట్రోల్స్ మొదలయ్యాయి.