టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్, బీసీసీఐ ఆగ్రహానికి గురై సెంట్రల్ కాంట్రాక్ట్‌నూ కోల్పోయిన సంగతి తెలిసిందే. ఐపీఎల్, దులీప్ ట్రోఫీలో జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు రంజీ ట్రోఫీలోనూ ముంబయికి ఆడుతున్న శ్రేయస్ భారీ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో త్వరలోనే భారత జట్టులోకి వస్తాననే ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘జాతీయ జట్టులోకి పునరాగమనం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. అయితే.. అదంతా మన చేతుల్లో ఉండదు. ఉత్తమ ఆటతీరును కనబరచడమే నా ముందున్న లక్ష్యం. మరిన్ని మ్యాచ్‌లు ఆడేందుకు ప్రయత్నిస్తున్నా. ఫిట్‌నెస్‌పరంగానూ మెరుగ్గా ఉన్నా. తప్పకుండా జాతీయ జట్టులోకి వస్తా. చాలా రోజుల తర్వాత సెంచరీ సాధించడం ఆనందంగా ఉంది. గాయాల నుంచి కోలుకుని వచ్చాక ఇలాంటి ఇన్నింగ్స్ ఆడగలిగా. వరుసగా మూడు ఛాంపియన్‌షిప్‌లు ( గత రంజీ ట్రోఫీ, ఐపీఎల్, ఇరానీ కప్) గెలిచిన జట్టులో భాగస్వామిగా ఉన్నా. ఇలాంటప్పుడు మన ఆటతీరును అందరూ గమనించే ఉంటారు’ అని శ్రేయస్ వెల్లడించాడు.