IND vs ENG: గిల్ డబుల్... ఇంగ్లాండ్ ట్రబుల్

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో భారత్ పైచేయి.. ముందుండి నడిపించిన సారధి గిల్.. అద్భుత ద్వి శతకంతో గిల్ కొత్త చరిత్ర;

Update: 2025-07-04 01:30 GMT

ఇం­గ్లాం­డ్ తో జ‌­రు­గు­తు­న్న రెం­డో టె­స్టు­లో భా­ర­‌­త్ ఆధి­ప­‌­త్యం ప్ర­‌­ద­‌­ర్శి­స్తోం­ది. గు­రు­వా­రం రెం­డో రోజు భా­రీ­స్కో­రు చే­సిన భా­ర­‌­త్.. బౌ­లిం­గ్ లో ఇం­గ్లాం­డ్ ను క‌­ట్టి ప‌­డే­సిం­ది. దీం­తో రెం­డో రోజు ఆట­‌­ము­గి­సే­స­‌­రి­కి 20 ఓవ­‌­ర్ల­‌­లో 3 వి­కె­ట్ల­‌­కు 77 ప‌­రు­గు­లు చే­సిం­ది. ఇంకా 510 ప‌­రు­గుల వె­ను­కుం­జ­‌­లో ని­లి­చిం­ది. భా­ర­‌త బౌ­ల­‌­ర్ల­‌­లో ఆకా­శ్ దీప్ రెం­డు వి­కె­ట్ల­‌­తో రా­ణిం­చా­డు. అం­త­‌­కు­ముం­దు తొలి ఇన్నిం­గ్స్ లో 587 ప‌­రు­గు­ల­‌­కు ఇం­డి­యా ఆలౌ­టైన సం­గ­‌­తి తె­లి­సిం­దే. శు­భ­‌­మా­న్ గిల్ కె­ప్టె­న్ ఇన్నిం­గ్స్ (387 బం­తు­ల్లో 269, 30 ఫో­ర్లు, 3 సి­క్స­‌­ర్లు)తో టాప్ స్కో­ర­‌­ర­‌­ర్ గా ని­లి­చా­డు. ఇం­గ్లాం­డ్ బౌ­ల­ర్ షో­య­‌­బ్ బ‌­షీ­ర్ మూడు వి­కె­ట్ల­‌­తో స‌­త్తా చా­టా­డు. 

 గిల్‌కు తొలి డబుల్ సెంచరీ

అసలు సి­స­లైన టె­స్ట్ ఇన్నిం­గ్స్ ఆడిన గిల్ 387 బం­తు­ల్లో 30 ఫో­ర్లు, మూడు సి­క్స్‌­ల­తో 269 పరు­గుల భారీ స్కో­రు సా­ధిం­చా­డు. టె­స్ట్‌­ల్లో డబు­ల్ సెం­చ­రీ సా­ధిం­చ­డం గి­ల్‌­కు ఇదే తొ­లి­సా­రి. ఇం­గ్లం­డ్‌­లో డబు­ల్ సెం­చ­రీ సా­ధిం­చిన తొలి భారత కె­ప్టె­న్‌­గా గిల్ ని­లి­చా­డు. గి­ల్‌­తో పాటు రవీం­ద్ర జడే­జా (89), యశ­స్వి జై­స్వా­ల్ (87) కీలక పరు­గు­లు చే­శా­రు. చి­వ­ర్లో వా­షిం­గ్ట­న్ సుం­ద­ర్ (42) గి­ల్‌­తో కీలక భా­గ­స్వా­మ్యం నె­ల­కొ­ల్పా­డు. దీం­తో టీ­మిం­డి­యా 151 ఓవ­ర్ల­లో 587 పరు­గు­లు సా­ధిం­చిం­ది. కో­హ్లీ­ని అధి­గ­మిం­చి టె­స్టు­ల్లో అత్య­ధిక స్కో­రు చే­సిన భారత కె­ప్టె­న్‌­గా గిల్ రి­కా­ర్డు­ల­కె­క్కా­డు. కో­హ్లీ 2016లో పుణె వే­ది­క­గా జరి­గిన టె­స్టు­లో 254 పరు­గు­లు చేసి అజే­యం­గా ని­లి­చా­డు.ఇక, ఇం­గ్లాం­డ్‌­లో అత్య­ధిక స్కో­రు చే­సిన టీ­మ్‌­ఇం­డి­యా కె­ప్టె­న్‌­గా­నూ గిల్ ఘనత సా­ధిం­చా­డు. అం­త­కు­ముం­దు ఈ రి­కా­ర్డు అజ­హ­రు­ద్దీ­న్ పే­రిట ఉం­డే­ది. అజ­హ­రు­ద్దీ­న్ 1990లో ఓల్డ్ ట్రా­ఫో­ర్డ్‌­లో 179 పరు­గు­లు పరు­గు­లు చే­శా­డు.

రాణించిన ఆకాశ్ దీప్..

ఫ్లా­ట్ వి­కె­ట్ పై ఇం­డి­య­న్ బౌ­ల­ర్లు అద్భు­తం­గా రా­ణిం­చా­రు. త‌­క్కువ వ్య­‌­వ­‌­ధి­లో­నే మూడు వి­కె­ట్లు తీసి, స‌­త్తా చా­టా­రు. ము­ఖ్యం­గా ఇం­గ్లాం­డ్ లో తొలి టె­స్టు ఆడిన ఆకా­శ్ దీప్ స‌­త్తా చా­టా­డు. త‌న రెం­డో ఓవ­‌­ర్లో­నే వ‌­రుస బం­తు­ల్లో తొలి టె­స్టు హీరో బెన్ డ‌­కె­ట్, ఒల్లీ పోప్ ల‌ని డ‌­కౌ­ట్ చే­శా­డు. ముం­దు­గా ఆఫ్ సైడ్ వే­సిన బం­తి­ని డ‌­కె­ట్ పుష్ చే­య­‌­గా, స్లి­ప్ లో గిల్ అద్భు­త­‌­మైన క్యా­చ్ అం­దు­కు­న్నా­డు. ఆ త‌­ర్వాత ఆఫ్ స్టం­ప్ పై ప‌­డిన బం­తి­ని డ్రై­వ్ ఆడ­బో­యి పోప్ స్లి­ప్ లో కే­ఎ­ల్ రా­హు­ల్ కు చి­క్కా­డు. ఆ త‌­ర్వాత కు­దు­రు­కు­న్న మ‌రో ఓపె­న­‌­ర్ జాక్ క్రా­లీ (19)ని హై­ద­‌­రా­బా­దీ పే­స­‌­ర్ మ‌­హ్మ­‌­ద్ సి­రా­జ్ ఔట్ చే­శా­డు. దీం­తో 25/3 తో ఇం­గ్లాం­డ్ పీ­క­‌­ల్లో­తు క‌­ష్టా­ల్లో ప‌­డిం­ది. ఈ ద‌­శ­‌­లో జో రూట్ (18 బ్యా­టిం­గ్), హేరీ బ్రూ­క్ (30 బ్యా­టిం­గ్) మంచి భా­గ­‌­స్వా­మ్యా­న్ని ఏర్పా­టు చేసి, జ‌­ట్టు కో­లు­కు­నే­లా చూ­శా­రు. వీ­రి­ద్ద­రూ అబే­ధ్య­మైన నా­లు­గో వి­కె­ట్ కు 52 పరు­గు­లు జో­డిం­చా­రు. . SENA దేశాల్లో ద్వి శతకం చేసిన తొలి ఆసియా కెప్టెన్‌గా గిల్ ఘనత సాధించాడు. 2003 తర్వాత ఇంగ్లాండ్‌లో ద్వి శతకం చేసిన తొలి విదేశీ కెప్టెన్ గిల్‌యే కావడం విశేషం.

Tags:    

Similar News