Pak vs Ban : పాక్ – బంగ్లా టెస్ట్ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్

Update: 2024-08-27 16:00 GMT

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓడి షాక్‌లో ఉన్న పాకిస్థాన్‌ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రావల్పిండి వేదికగా ఇరుజట్ల మధ్య జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్ నమోదైంది. దీంతో రెండు జట్లకు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2023-25 పాయింట్లలో ఐసీసీ కోత విధించింది. మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు నిర్ణీత సమయంలో పాకిస్థాన్ ఆరు ఓవర్లు తక్కువ వేసినట్లు తేలింది. దీంతో ఆ జట్టులో ఖాతాలో 6 పాయింట్లు కట్ చేయడంతోపాటు మ్యాచ్‌ ఫీజులో 30 శాతం జరిమానాగా విధించింది. బంగ్లాదేశ్‌ కూడా స్లో ఓవర్‌ రేట్ కారణంగా 3 పాయింట్లు కోల్పోయింది. బంగ్లా జట్టుకు ఐసీసీ 15 శాతం జరిమానా విధించింది. తాజా పరిణామాలతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్‌ ఏడో స్థానానికి పడిపోయింది. పాకిస్థాన్‌ మరింత దిగజారి 8వ స్థానంలో ఉంది. తొలి టెస్టులో పాక్‌ను బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. టెస్టుల్లో పాకిస్థాన్‌పై బంగ్లాకిదే తొలి విజయం.

Tags:    

Similar News