టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ పై సస్పెన్షన్ వేటు పడింది. కేరళకు చెందిన శ్రీశాంత్ పై ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేసీఏ) మూడేళ్ల నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కేరళ క్రికెట్ అసోసియేషన్ కు వ్యతిరేకంగా అసత్యపు ఆరోపణలు, కించపరిచే వ్యాఖ్యలు చేశాడని
శ్రీకాంత్ పై కఠిన చర్యలు తీసుకోవడం జరిగిందని కేసీఏ తెలిపింది. కాగా, చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ స్టార్, కేరళ క్రికెటర్ సంజూ శాంసన్కు కేసీఏతో విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. శిక్షణ శిబిరానికి హాజరు కానుందన ఇతడిపై సీరియస్ అయిన కేసీఏ.. ప్రతిష్టాత్మకమైన దేశవాళీ క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీకి సంజూను ఎంపిక చేయలేదు. దీంతో సంజూ శాంసన్ కు మద్దతుగా మరో కేరళ సీనియర్ క్రికెటర్ శ్రీశాంత్ కేసీఏ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ, వారికి వ్యతిరేకం గా కామెంట్లు చేయడంతో ఇప్పుడు సస్పెన్షన్ కు గురయ్యాడు.