ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కెప్టెన్స్ ఫొటో షూట్, ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాక్‌కు వెళ్తారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 29 ఏళ్ల తర్వాత పాక్ ఐసీసీ టోర్నీ నిర్వహిస్తోందని పేర్కొన్నాయి. ఒకవేళ హిట్ మ్యాన్ నిజంగానే పాక్‌కు వెళ్తే ఆయన అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి అవుతుంది.
ఫిబ్రవరి 19న ఈ టోర్నీ ప్రారంభం కానుండగా, భారత్VSపాక్ మ్యాచ్ 23న దుబాయిలో జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్థాన్ - న్యూజిలాండ్ మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. భారత్ 23 ఫిబ్రవరి నాడు పాకిస్థాన్‌తో దుబాయ్‌లో ఆడనుంది. ఇప్పుడు, భారత్, పాకిస్థాన్ తమ స్క్వాడ్లను ఇంకా ప్రకటించలేదు. జనవరి 19 నాటికి అవి ప్రకటించే అవకాశం ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే నెల 19 నుంచి ప్రారంభం కానుంది. అంటే… ఫిబ్రవరి 17 గాని, లేదంటే 18న గాని ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. చాల ఏళ్ల తర్వాత పాక్ లో ఐసీసీ ఈవెంట్ జరుగుతున్ననేపథ్యంలో ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పాక్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఈ కారణంగానూ రోహిత్ తప్పనిసరిగా పాక్ కు వెళ్లక తప్పదన్న వాదన వినిపిస్తోంది.