టీమిండియా క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డ్ నమోదైంది. సొంతగడల్లో న్యూజీలాండ్ తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ లో భారత్ వైట్ వాష్ కు గురైంది. ముంబైలో జరిగిన మూడో టెస్టులో భారత్ బ్యాట్స్ మెన్ ఘోరంగా విఫలమయ్యారు. 147 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేయలేక చేతులెత్తేశారు. కేవలం 121 పరుగులకే బిస్తర్ సర్దేశారు టీమిండియా ప్లేయర్స్. తొలి ఇన్నింగ్స్ లో న్యూజీలాండ్ 235 పరుగులు చేయగా.. ఇండియా 263 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 28 పరుగుల లీడ్ వచ్చింది. రెండో ఇన్నింగ్ లో కివీస్ 174 పరుగులు చేయడంతో భారత్ విజయలక్ష్యం 147 పరుగులుగా ఉంది. అయితే టీమిండియా కేవలం 121 పరుగులకే ఆలౌటైంది. దీంతో కివీస్ 25 పరుగులతో మూడో టెస్టులోనూ పరాజయం పాలై ఈ సిరీస్ లో వైట్ వాషైంది.