భారత్ తరపున చెస్ ఒలంపియాడ్ లో విజేతలుగా నిలిచిన తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ నజరానా ప్రకటించారు. ఒక్కోక్కరికి రూ.25 లక్షల నగదు ప్రోత్సాహకాలను ఇస్తున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. చెస్ ఒలంపియాడ్ లో పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారులు అర్జున్, ద్రోణవల్లి హారిక సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం వారిని అభినందిస్తూ..భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి దేశానికి గొప్ప పేరు తీసుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావ్, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.