Ind vs Ban : బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్.. గిల్, బుమ్రా, సిరాజ్‌లకు రెస్ట్

Update: 2024-09-16 15:00 GMT

టెస్టు సిరీస్ తర్వాత బంగ్లాదేశ్– భారత జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. అయితే, ఈ సిరీస్ కు టీమిండియా స్టార్ ప్లేయర్స్ దూరంగా ఉండనున్నట్లు సమాచారం. ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌తోపాటు బౌలర్లు బుమ్రా, సిరాజ్‌లకు సెలెక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వర్క్‌ లోడ్‌ కారణంగా సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రొటేషన్‌ పద్దతిలో భాగంగా వీరిని పక్కకు పెట్టనున్నట్లు తెలుస్తుంది. యువ పేసర్లకు అవకాశం ఇవ్వడం కోసం సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే.. భారత్‌ త్వరలో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలతో టెస్ట్‌ సిరీస్‌లు ఆడనున్న విషయం తెలిసిందే.

పంత్‌ స్థానంలో ఇషాన్‌..

బంగ్లాతో టీ20 సిరీస్‌కు గిల్‌, బుమ్రా, సిరాజ్‌లతో పాటు రిషబ్‌ పంత్‌కు కూడా విశ్రాంతినిచ్చే ఛాన్స్‌ ఉంది. సెలెక్టర్లు ఒకవేళ పంత్‌ను పక్కన పెడితే అతడి స్థానంలో ఇషాన్‌ కిషన్‌కు అవకాశం ఇవ్వవచ్చు. ఇషాన్‌ ఇటీవలి కాలంలో సూపర్‌ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ అక్టోబర్‌ 6న ప్రారంభం కానుంది. గ్వాలియర్‌, ఢిల్లీ, హైదరాబాద్‌ వేదికలుగా అక్టోబర్‌ 7, 10, 13 తేదీల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి.

Tags:    

Similar News