West Indies Cricket : క్రికెట్‌కు విండీస్ విధ్వంసకర ప్లేయర్ రిటైర్‌మెంట్
వెస్టిండీస్ విధ్వంసకర ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో.. అతడు మొదటి రెండు మ్యాచ్‌లు ఆడున్నాడు. ఇవే రస్సెల్ విండీస్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్న చివరి మ్యాచ్‌లు. విండీస్ క్రికెట్ బోర్డు ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం రస్సెల్ ను ఎంపిక చేసింది. జమైకాలోని సబీనా పార్క్‌లో జరిగే మొదటి రెండు మ్యాచ్‌లు ఆడి, అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు రస్సేల్ ప్రకటించారు. విండీస్ బోర్డు సైతం రస్సేల్ రిటైర్‌మెంట్ ను ధృవీకరించింది.
వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించడం తన జీవితంలో గర్వించదగ్గ విషయమని రస్సేల్ తెలిపాడు. ఈ స్థాయికి చేరుకుంటానని అస్సలు ఊహించలేదుని తెలిపాడు. ‘‘నాకు విండీస్ తరపున ఆడటం ఇష్టం. నా కుటుంబం, ఫ్రెండ్స్ ముందు ఇంట్లో ఆడటం కూడా నాకు చాలా ఇష్టం. అక్కడ నేను నా ప్రతిభను ప్రదర్శించడానికి, మరింత నాణ్యమైన ప్రదర్శనలు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కరేబియన్ యంగ్ క్రికెటర్లకు రోల్ మోడల్‌గా ఉంటూనే నా అంతర్జాతీయ కెరీర్‌ను ఉన్నతంగా ముగించాలనుకుంటున్నాను’’ అని రస్సెల్ తెలిపాడు.
2019 నుంచి రస్సెల్ టీ20 ఆటగాడిగా ఉన్నాడు. అతను విండీస్ తరపున 84 టీ20లు ఆడాడు. 22.00 సగటుతో 1,078 రన్స్ చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 71. అలాగే రస్సెల్ 30.59 సగటుతో 61 వికెట్లు కూడా పడగొట్టాడు. కాగా రస్సెల్ వెస్టిండీస్ తరఫున ఒకే ఒక టెస్ట్, 56 వన్డేలు ఆడాడు. వీటిలో 27.21 సగటుతో 1,034 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి. వన్డేల్లో అతను 70 వికెట్లు పడగొట్టాడు. ఇక, రస్సెల్ అనేక టీ20 లీగ్‌లలో ఆడాడు. మొత్తంగా 561 మ్యాచ్‌ల్లో 168 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 9,316 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.