టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అభిమానులకు శుభవార్త చెప్పారు. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతానని స్పష్టం చేశారు. ముంబైలో నిర్వహించిన ఓ ప్రోగ్రామ్ లో విరాట్ హాట్ స్టేట్ మెంట్ ఇచ్చారు. మీ తదుపరి బిగ్ స్టెప్ ఏంటి? అని హోస్ట్ ప్రశ్నించగా, కోహ్లి స్పందిస్తూ.... "తదుపరి బిగ్సెప్ట్ గురించి ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ వరల్డ్ కప్ గెలవడానికి తప్పకుండా ప్రయత్నిస్తాం" అని అన్నారు. పరోక్షంగా 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఆడతానని సంకేతాలిచ్చాడు. దీంతో అక్కడున్న ప్రేక్షకులు చప్పట్లతో ఆడిటోరియాన్ని మార్మోగించారు. అటు అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు.
కోహ్లి ప్రకటన సోషల్ మీడియా హల్ చల్ చేస్తోంది. అటు కెప్టెన్ రోహిత్ కూడా వన్డే వరల్డ్ కప్ నెగ్గడం తన డ్రీమ్ అని పలుమార్లు చెప్పాడు. ఈ నేపథ్యంలో విరాట్ తో పాటు రోహిత్ శర్మ కూడా రానున్న వరల్డ్ కప్ లో ఉండాల్సిందే అంటూ కామెంట్లు పెడుతున్నారు. 2027 వన్డే ప్రపంచ కప్ టోర్నీకి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ుపై ఊహాగానాలు వచ్చాయి. అయితే వాటిలో నిజం లేదని కోహ్లి స్పష్టం చేస్తూ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చాడు. 2023 వన్డే వరల్డ్ కప్లో సొంతగడ్డపై ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఓడిపోయింది. ఈ టోర్నీ మొత్తం అద్భుతంగా రాణించిన విరాట్ 761 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ స్ అవార్డు పొందాడు. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాటకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి, వన్డేల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అయితే టెస్టుల్లో మాత్రం కాస్త యాక్టివ్ కావాల్సి ఉంది.