ఇండియాకు మరో మెడల్ ఖాయం చేసిన రెజ్లర్ రవికుమార్..!
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ స్టార్ రెజ్లర్ రవి కుమార్ దహియా దూకుడుకు అడ్డే లేకుండా పోయింది. వరుసగా విజయాలు సాధిస్తున్న అతడు.. తాజాగా ఫైనల్ చేరాడు.;
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ స్టార్ రెజ్లర్ రవి కుమార్ దహియా దూకుడుకు అడ్డే లేకుండా పోయింది. వరుసగా విజయాలు సాధిస్తున్న అతడు.. తాజాగా ఫైనల్ చేరాడు. బుధవారం జరిగిన 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో కజకిస్థాన్ రెజ్లర్ నూరిస్లామ్ సనయేవ్‌పై అతడు గెలిచాడు. ఫైనల్ లో గెలిస్తే గోల్డ్ మెడల్, ఓడితే సిల్వర్ మెడల్ వస్తుంది. అంటే భారత్ ఖాతాలో నాలుగో పతకం చేరనుంది. ఇప్పటి వరకూ ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో సుశీల్‌కుమార్, యోగేశ్వర్‌దత్‌లు మాత్రమే ఇండియాకు సిల్వర్ మెడల్స్ అందించారు.