WWC: అమ్మాయిల చేతిలోనూ దాయాది చిత్తు

వన్డే ప్రపంచకప్‌ 2025లో పాక్ చిత్తు... దాయాదిపై టీమిండియా విజయం... 88 పరుగుల తేడాతో దాయాది చిత్తు

Update: 2025-10-06 01:30 GMT

మహి­ళల వన్డే ప్ర­పం­చ­క­ప్‌ 2025లో భారత జట్టు.. పా­కి­స్థా­న్‌­ను చి­త్తు చే­సిం­ది. శ్రీ­లం­క­లో­ని కొ­లం­బో­లో జరి­గిన ఈ మ్యా­చ్‌­లో ఆల్‌­రౌం­డ్ ప్ర­ద­ర్శ­న­తో అద­ర­గొ­ట్టిన టీ­మిం­డి­యా.. దా­యా­ది దే­శం­పై ఘన వి­జ­యం సా­ధిం­చిం­ది. టాస్ ఓడి తొ­లుత బ్యా­టిం­గ్ చే­సిన భా­ర­త్.. 247 పరు­గు­లు చే­సిం­ది. అనం­త­రం పా­కి­స్థా­న్‌­ను 159 పరు­గు­ల­కు కు­ప్ప­కూ­ల్చిం­ది. దీం­తో ఈ టో­ర్నీ­లో వరు­స­గా రెం­డు వి­జ­యా­లు సా­ధిం­చి.. పా­యిం­ట్స్ టే­బు­ల్‌­లో అగ్ర­స్థా­నా­ని­కి దూ­సు­కె­ళ్లిం­ది. మరో­వై­పు పా­కి­స్థా­న్ ఆడిన రెం­డు మ్యా­చ్‌­ల­లో­నూ ఓడి­పో­యిం­ది.

రాణించిన రిచా ఘోష్

టాస్ ఓడి తొ­లుత బ్యా­టిం­గ్ చే­సిన టీ­మిం­డి­యా.. 247 పరు­గుల మె­రు­గైన స్కో­రు చే­య­డం ఊహిం­చ­ని­దే. ఇన్నిం­గ్స్‌­లో చాలా భాగం జో­రం­దు­లే­క­పో­యిన భా­ర­త్.. తక్కువ స్కో­రు­తో­నే సరి­పె­ట్టు­కు­నే­లా కని­పిం­చిం­ది. పా­క్‌ బౌ­ల­ర్లు చక్క­ని బౌ­లిం­గ్‌­తో హర్మ­న్‌­ప్రీ­త్‌ సే­న­కు కళ్లెం వే­సి­న­ట్లే­న­ని అని­పిం­చిం­ది.. కానీ ఆఖ­ర్లో వి­కె­ట్‌­కీ­ప­ర్‌ బ్యా­ట­ర్‌ రిచా ఘో­ష్‌ వి­ధ్వం­సక బ్యా­టిం­గ్‌­తో భా­ర­త్‌ కో­లు­కుం­ది. ఆమె ధనా­ధ­న్‌ ఇన్నిం­గ్స్‌­తో మె­రు­గైన లక్ష్యా­న్ని ని­ర్దే­శిం­చ­గ­లి­గిం­ది. ఓపె­న­ర్లు స్మృ­తి మం­ధాన (23; 32 బం­తు­ల్లో 4×4), ప్ర­తీక రా­వ­ల్‌ కొ­న్ని బౌం­డ­రీ­లు బా­ది­నా.. సరి­గా స్ట్రై­క్‌­రొ­టే­ట్‌ చే­య­లే­క­పో­యా­రు. కె­ప్టె­న్‌ హర్మ­న్‌­ప్రీ­త్‌ కౌ­ర్‌ (19; 34 బం­తు­ల్లో 2×4)తో 39 పరు­గు­లు జో­డిం­చిం­ది. క్రీ­జు­లో కు­దు­రు­కు­న్నాక, జట్టు స్కో­రు 106 వద్ద హర్మ­న్‌­ప్రీ­త్‌ ఔటైం­ది. ఆ తర్వాత కూడా చక్క­ని బ్యా­టిం­గ్‌­ను కొ­న­సా­గిం­చిన హర్లీ­న్‌.. జె­మీ­మా­తో మరో వి­లు­వైన భా­గ­స్వా­మ్యా­న్ని (45) నె­ల­కొ­ల్పిం­ది. భా­ర­త్‌ 33 ఓవ­ర్ల­లో 151/3తో ని­లి­చిం­ది.


దీ­ప్తి శర్మ (25; 33 బం­తు­ల్లో 1×4)), స్నే­హ్‌ రాణా (20; 33 బం­తు­ల్లో 2×4) జట్టు­ను ఆదు­కు­న్నా­రు. భా­ర­త్‌ 46వ ఓవ­ర్లో 203/7తో ని­లి­చిం­ది. భా­ర­త్‌­ను ని­యం­త్రిం­చ­డం­లో పా­క్‌ వి­జ­య­వం­త­మై­న­ట్లే కని­పిం­చిం­ది. కానీ చి­వ­ర్లో రిచా ఘోష్.. 20 బం­తు­ల్లో 35 రన్స్ చేసి.. టీ­మిం­డి­యా మె­రు­గైన స్కో­రు సా­ధిం­చే­లా చే­సిం­ది. రిచా రె­చ్చి­పో­వ­డం­తో భా­ర­త్‌ ఆఖరి నా­లు­గు ఓవ­ర్ల­లో ఎంతో వి­లు­వైన 44 పరు­గు­లు రా­బ­ట్టిం­ది. అల­వో­క­గా షా­ట్లు ఆడిన ఆమె.. మూడు ఫో­ర్లు, రెం­డు సి­క్స్‌­ల­తో ఇన్నిం­గ్స్‌­కు మె­రు­పు ము­గిం­పు­ని­చ్చిం­ది.

 సిద్రా ఒంటరి పోరాటం

అనం­త­రం బ్యా­టిం­గ్‌­కు ది­గిన పా­కి­స్థా­న్.. ఏ దశ­లో­నూ గె­లి­చే­లా కని­పిం­చ­లే­దు. భారత బౌ­ల­ర్ల దె­బ్బ­కు వరు­స­గా వి­కె­ట్లు కో­ల్పో­యిం­ది. పాక్ మహి­ళా బ్యా­ట­ర్లు పె­వి­లి­య­న్‌­కు క్యూ కట్టా­రు. అయి­తే ఓవై­పు వి­కె­ట్లు పడు­తు­న్నా వన్ డౌన్ బ్యా­ట­ర్ సి­ద్రా ఆమి­న్ (106 బం­తు­ల్లో 81 రన్స్‌) మా­త్రం పో­రా­టం చే­సిం­ది. కానీ ఆమె పో­రా­టం పరు­గుల అం­త­రా­న్ని తగ్గిం­చిం­దే తప్ప ఒట­మి­ని కాదు. భారత బౌ­ల­ర్ల దె­బ్బ­కు పా­కి­స్థా­న్.. 43 ఓవ­ర్ల­లో 159 పరు­గు­ల­కు ఆలౌ­ట్ అయిం­ది. భారత బౌ­ల­ర్ల­లో క్రాం­తి గౌడ్ 3, దీ­ప్తి శర్మ 3, స్నే­హ్ రాణా 2 వి­కె­ట్లు తీ­శా­రు.

మ్యాచ్‌కు ముందు టాస్ సమయంలో వివాదం తలెత్తింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ వేసే క్రమంలో మ్యాచ్ రిఫరీ వ్యవహార శైలి విమర్శలకు దారి తీసింది. టాస్ విషయంలో పాక్ కెప్టెన్ హెడ్, టెయిల్ రెండూ చెప్పడం వివాదానికి దారి తీసింది.

Tags:    

Similar News