పాకిస్థాన్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో అఫ్గానిస్థాన్ టీమ్ మెంటార్‌గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని అఫ్గాన్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. గతంలో ఆయన అఫ్గాన్‌కు బ్యాటింగ్ కోచ్‌గానూ పనిచేశారు. ఆయనకు PSL, అబుదాబి T10 లీగ్‌లో కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఫిబ్రవరి 19న పాకిస్థాన్VSన్యూజిలాండ్ మ్యాచుతో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజాలలో ఒకరైన యూనిస్ ఖాన్‌కు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. గతంలో అతడు పాకిస్తాన్ క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా కూడా పనిచేశాడు. అదే విధంగా పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీ,అబుదాబి T10 లీగ్‌లో బంగ్లా టైగర్స్‌తో కూడా కలిసి పనిచేశాడు. పాక్ తరపున 118 టెస్టులు ఆడిన యూనిస్ ఖాన్ 10,099 పరుగులు చేశాడు. అంతేకాకుండా అతడి సారథ్యంలోనే 2009 టీ20 ప్రపంచకప్‌ను పాక్ సొంతం చేసుకుంది.