IPL : యుజ్వేంద్ర చాహల్ చెత్త రికార్డు

Update: 2024-05-25 05:07 GMT

ఐపీఎల్ చరిత్రలో అత్యధికులు సిక్సులు సమర్పించుకుని.. రాజస్థాన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చెత్త రికార్డుని మూటగట్టుకున్నారు. సన్‌రైజర్స్‌తో నిన్న జరిగిన మ్యాచులో ఆయన రెండు సిక్సులిచ్చారు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ఆయన 224 సిక్సులు ఇచ్చి.. మాజీ స్పిన్నర్ పీయూష్(224) పేరిట ఉన్న రికార్డును అధిగమించారు. కాగా క్వాలిఫైయర్-2 మ్యాచులో చాహల్ నిరాశపర్చారు. 4 ఓవర్లలో వికెట్ తీయకుండా 34 పరుగులు సమర్పించుకున్నారు.

మరోవైపు ఐపీఎల్ టైటిల్ వేటలో సన్‌రైజర్స్‌ దుమ్మురేపింది. క్వాలిఫయర్-2లో రాజస్థాన్ పై ఘన విజయం సాధించి, ఫైనల్‌కు దూసుకెళ్లింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ను హైదరాబాద్ బౌలర్లు మడతబెట్టేశారు. 139 పరుగులకే పరిమితం చేసి.. 36 రన్స్ తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. జురెల్ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆదివారం ఫైనల్ లో ఇదే చెపాక్ స్టేడియంలో KKR vs -SRH తలపడనున్నాయి.

Tags:    

Similar News