టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ మళ్లీ ఐపీఎల్ లోకి అడుగుపెట్టాడు. అతడిని లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గా నియమించుకుంది. ఈ మేరకు లక్నో మేనేజ్‌మెంట్ తన సోషల్ మీడియా ఖాతాలో అధికారికంగా వెల్లడించింది. 2025 ఐపీఎల్ సీజన్ నుంచి జహీర్ ఖాన్ ఈ కొత్త బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఎంతో అనుభవం ఉన్న జహీర్ రాక జట్టులో కొత్త ఉత్సాహాన్నివ్వడం ఖాయం. ఎందుకంటే గౌతమ్ గంభీర్ మార్గనిర్దేశకత్వంలో లక్నో 2022, 2023 సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేరింది. తర్వాత గంభీర్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మెంటార్‌గా వెళ్లాడు. దీంతో ఆ ప్రభావం ఎల్‌ఎస్‌జీ ప్రదర్శనపై పడింది. గత సీజన్‌లో లక్నో ప్లేఆఫ్స్‌కు చేరలేకపోయింది. బౌలింగ్ కోచ్‌గా ఉన్న మోర్నీ మోర్కెల్ ఇప్పుడు సహాయక సిబ్బందిలో లేడు. మోర్కెల్ ఇటీవల భారత జట్టు బౌలింగ్ కోచ్‌గా నియమితుడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎంతో అనుభవమున్న జహీర్ ఖాన్‌ను లక్నోమెంటార్‌గా చేర్చుకుంది.భారత క్రికెట్‌లో అత్యుత్తమ ఫాస్ట్‌బౌలర్లలో ఒకడిగా పేరుసంపాదించిన జహీర్ ఖాన్‌కు ఐపీఎల్‌లో ఆడిన అనుభవముంది. ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డేవిల్స్ తరఫున ఆడాడు. ఐపీఎల్‌లో 100 మ్యాచ్‌లు ఆడి 102 వికెట్లు పడగొట్టాడు. 2017లో అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పాడు.