GSAT-24: ఇస్రో నుండి మరో ఉపగ్రహం.. సక్సెస్ అయిన ప్రయోగం..
GSAT-24: ఇస్రో రూపొందించిన జీశాట్-24 ఉపగ్రహ ప్రయోగం సక్సెస్ అయింది..;
GSAT-24: ఇస్రో రూపొందించిన జీశాట్-24 ఉపగ్రహ ప్రయోగం సక్సెస్ అయింది.. కౌరులోని ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది.. ఏరియన్-5 రాకెట్ ద్వారా జీశాట్-24ను భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టారు శాస్త్రవేత్తలు. ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్‌కు చెందిన మీశాట్-3డీతోపాటు ఒక మల్టీ-మిషన్ కమ్యూనికేషన్స్ శాటిలైట్‌ను కూడా ప్రయోగించారు.. ఫ్రెంచ్ కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల 50 నిమిషాల సమయంలో లాంచింగ్ జరిగింది.
గయానా స్పేస్ సెంటర్ నుంచి ఇది 113వ ప్రయోగం. ఏరియన్-5 వాహకనౌక ద్వారా జీశాట్-24 విజయంతంగా వేరు చేయబడిందని.. ఈ మేరకు సిగ్నల్స్ కూడా అందాయని ఏరియన్‌స్పేస్ ట్విటర్ వేదికగా ప్రకటించింది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కోసం ఈ జీశాట్-24 కమ్యూనికేషన్ శాటిలైట్‌ను ఇస్రో రూపొందించింది.. డిమాండ్-డ్రైవ్ తరహాలో ఇస్రో సిద్ధం చేసిన తొలి ఉపగ్రహం ఇదే కావడం విశేషం.
జీశాట్-24 శాటిలైట్‌కి అవసరమైన నిధులను NSIL సమకూర్చింది. దీంతో ఈ ఉపగ్రహాన్ని ఎన్‌ఎస్‌ఐఎల్ ఆపరేటింగ్ చేయనుంది. ఈ శాటిలైట్ ద్వారా దేశవ్యాప్తంగా డీటీహెచ్ అప్లికేషన్ అవసరాలను తీర్చవచ్చు.. హై క్వాలిటీతో టీవీ, టెలీ కమ్యూనికేషన్, బ్రాడ్ బ్యాండింగ్ సర్వీసులు అందించే వీలుంటుంది. జీశాట్-24 కార్యకలాపాలు మొదలైతే ఒకే స్పెక్ట్రంలో మరిన్ని డీటీహెచ్ చానల్స్‌ను కస్టమర్లకు అందించే అవకాశం కలుగుతుంది.
We just received confirmation that the second passenger, GSAT-24 successfully separated! Thanks @NSIL_India for their trust!
— Arianespace (@Arianespace) June 22, 2022
We now are waiting for the signal acquisition of both satellites!#VA257@isro @ArianeGroup @Ariane5 @esa @CNES @EuropeSpacePort @BxMetro