భారీ బ్యాటరీతో స్మార్ట్ ఫోన్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 48రోజులు..
OUKITEL: స్మార్ట్ ఫోన్ ఉన్న వారు తమ ఫోన్ ను గేమ్స్, మూవీస్, సాంగ్స్ ఇలా అన్నింటికి ఉపయోగిస్తుంటారు.;
OUKITEL:స్మార్ట్ ఫోన్ ఉన్న వారు తమ ఫోన్ ను గేమ్స్, మూవీస్, సాంగ్స్ ఇలా అన్నింటికి ఉపయోగిస్తుంటారు. కొందరైతే తమ మొబైల్ లో బ్యాటరీ అయిపోయేంత వరకు ఉపయోగిస్తారు. కొందరి ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుంది. అయితే ఈ ఫోన్ ఉంటే వారు ఇక దిగులు పడాల్సిన పని లేదు. దీనిలో ఎన్ని గేమ్స్ ఆడినా చార్జ్ అయిపోదు. దీని బ్యాటరీ సామర్థ్యం ఏకంగా 15600 ఎంఏహెచ్‌గా ఉంది మరి.
భారీ బ్యాటరీ ఉన్న ఫోన్ అవుకిటెల్ అనే కంపెనీ లాంచ్ చేసింది. అవుకిటెల్ డబ్ల్యూపీ15 1300 గంటల స్టాండ్‌బై టైంను అందిస్తుంది. రగ్డ్ ప్రొటెక్షన్ కూడా ఇందులో అందించారు. 5జీ వర్షన్ అందుబాటులోకి తీసుకోచ్చింది. అవుకిటెల్ డబ్ల్యూపీ15 5జీ ఫీచర్లు చూద్దాం..
స్పెసిఫికేషన్లు
మందం 2.38 సెంటీమీటర్లు కాగా, బరువు 485 గ్రాములు
6.52 అంగుళాల హెచ్‌డీ+ ఇన్‌సెల్ డిస్ ప్లే
యాస్పెక్ట్ రేషియో 18:9
ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం
వెనకవైపు మూడు కెమెరాలు
ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్,
0.3 మెగాపిక్సెల్ బొకే లెన్స్, 2 మెగాపిక్సెల్ మైక్రో లెన్స్
ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరా
బ్యాటరీ సామర్థ్యం 15600 ఎంఏహెచ్
18W ఫాస్ట్ చార్జింగ్
ఫోన్ పూర్తిగా చార్జ్ అవ్వడానికి ఐదు గంటల సమయం
డ్యూయల్ 5జీ, వైఫై డైరెక్ట్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు