Samsung: Galaxy Z: సామ్‌సంగ్ నుంచి ఫోల్డ్, ఫ్లిప్ మోడల్ ఫోన్లు విడుదల
భారత మార్కెట్‌లో Z Fold 5 12GB+256GB వేరియంట్ ప్రారంభ ధర రూ. 154,999, 12GB+512GB వేరియంట్ ధర రూ. 164,999 గా నిర్ణయించారు.. Samsung Galaxy Z Flip 5 ధర 8GB+256GB వేరియంట్‌కు రూ.99,999 గా ధర నిర్ణయించారు;
Samsung Z Fold, Flip Models: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఫోన్ అభిమానుల కోసం సామ్‌సంగ్ ఫోల్డ్, ఫ్లిప్ మోడళ్లలో రెండు నూతన మోడళ్లను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. గెలాక్సీ Z ఫోల్డ్-5 ఫోన్ 1,54,999, గెలాక్సీ Z ఫ్లిప్-5 ఫోన్ 99,999 లల్లో ఈ ఫోన్లు లభించనున్నాయి. భారత మార్కెట్‌లో Z Fold 5 12GB+256GB వేరియంట్ ప్రారంభ ధర రూ. 154,999, 12GB+512GB వేరియంట్ ధర రూ. 164,999 గా నిర్ణయించారు.. Samsung Galaxy Z Flip 5 ధర 8GB+256GB వేరియంట్‌కు రూ.99,999 గా ధర నిర్ణయించారు.
ఈ ఫోన్లలో ఉత్తమ శ్రేణి క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్-2 ప్రాసెసర్ వినియోగించారు. ఈ చిప్‌సెట్‌తో ఫోల్డ్, ఫ్లిప్ మోడళ్లు అత్యుత్తమ పనితీరుని కనబరుస్తాయి. ఫోన్‌లో 2 తెరలు చూయించడానికి, స్క్రీన్‌కి తగ్గట్టుగా 1HZ -120Hz రిఫ్రెష్ రేట్‌తో పనిచేయనుంది. దీంతో బ్యాటరీ త్వరగా తగ్గిపోకుండా ఉంటుంది. ఈ మోడళ్లు IPX8 రేటింగ్‌తో వస్తున్నాయి. దీంతో ఫోన్లను వర్షంలోనూ ఎటువంటి భయం లేకుండా ఉపయోగించవచ్చు.
సామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 5, గెలాక్సీ Z ఫ్లిప్ 5: టాప్ ఫీచర్స్
డిస్‌ప్లే: Z ఫోల్డ్‌లో 7.6 ఇంచ్ QXGA+AMOLED అంతర్గత స్క్రీన్, 6.2 అంగుళాల కవర్ స్క్రీన్లతో రానుంది. ఫ్లిప్ ఫోన్‌లో 6.7 అంగుళాల AMOLED స్క్రీన్‌తో పాటు, బయట 3.4 అంగుళాల స్క్రీన్‌తో రానుంది. బయట ఉండే 2వ స్క్రీన్‌తో ఫోన్‌ని తెరవకుండానే మెసేజెస్ వంటి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు.
చిప్‌సెట్: ఈ రెండు ఫోన్లు కూడా క్వాల్‌కామ్ 8th జెన్-2 స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో రానున్నాయి.
సాఫ్ట్‌వేర్: రెండు ఫోన్లలో లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేయనుంది.
బ్యాటరీ: గెలాక్సీ Z ఫోల్డ్ 5 4,400 బ్యాటరీతో రానుండగా, ఫ్లిప్ 5 ఫోన్ 3,700 బ్యాటరీతో రానుంది.
కెమెరా: సామ్‌సంగ్ ఫ్లిప్ 5 ఫోన్‌లో రెండు 12 MP అల్ట్రా వైడ్ ప్రైమరీ సెన్సార్, 12 MP వైడ్ యాంగిల్ కెమెరాలు ఉన్నాయి. ఫోల్డ్ 5 లో 3 కెమెరాలతో కూడిన 50MP వైడ్ యాంగిల్, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్, 10MP టెలిఫోటో కెమెరాలతో రానుంది.
రెండు ఫోన్లలోనూ సెల్ఫీల కోసం 10MP కెమెరాలు అమర్చారు.