Whats App New Feature: వాట్సప్‌లో ఎవరికి వారే మెసేజ్ చేసుకోవడం ఎలానో తెలుసా.. ఇవిగో స్టెప్స్

Whats App New Feature: ఏదైనా ఓ కోట్ చదివేతేనో, మరేదైనా క్లిప్ బావుందనిపిస్తేనో ఎవరో ఒకరికి మెసేజ్ చేయాలనిపిస్తుంది. లేదా ఆ సమచారం మనకి చాలా విలువైనదిగా అనిపించవచ్చు.

Update: 2022-12-14 06:13 GMT

Whats App New Feature: ఏదైనా ఓ కోట్ చదివేతేనో, మరేదైనా క్లిప్ బావుందనిపిస్తేనో ఎవరో ఒకరికి మెసేజ్ చేయాలనిపిస్తుంది. లేదా ఆ సమచారం మనకి చాలా విలువైనదిగా అనిపించవచ్చు. ఎక్కడో ఒకచోట సేఫ్‌గా ఉండాలి. మరి ఎలా.. మనదగ్గరే ఉంటే ఇంకా మంచిది కదా. అందుకే మీ కోసం వాట్సాప్‌లో మనకి మనమే మెసేజ్ పంపుకునే ఫీచర్ ఒకటి క్రియేట్ చేశారు. అదే మెసేజ్ యువర్‌సెల్ఫ్ ఫీచర్.



వాట్సాప్‌లో కూడా నోట్స్ లాంటి ఫీచర్ ఒకటి ఉంటే బావుంటుందని యూజర్లు చాలా కాలం నుంచి డిమాండ్ చేయడంతో ఇది రూపుదిద్దుకుంది.


ఇక నుంచి యూజర్లు తమకు తామే మెసేజ్ చేసుకోవచ్చు. ముఖ్యమైన నోట్స్, రిమైండర్స్, షాపింగ్ లిస్ట్, ఫోటోలు, వీడియోలు లాంటివన్నీ తమ ఛాట్‌లో సేవ్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేకుండా తమ ఛాట్ ఓపెన్ చేసే చాలు. అందులో తాము దాచుకున్న వివరాలు అన్నీ కనిపిస్తాయి.


ఇందుకోసం ముందుగా మీ వాట్సాప్ ఓపెన్ చేయండి. కొత్త ఛాట్ క్రియేట్ చేసేందుకు క్రియేట్ న్యూ ఛాట్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత కాంటాక్ట్స్‌లో మీ పేరు టాప్‌లో కనిపిస్తుంది. ఓపెన్ చేయండి. మీ పేరుతో ఛాట్ ఓపెన్ అవుతుంది. అందులో మెసేజ్ చేస్తే చాలు. కావాలనుకుంటే మీ ఛాట్‌ను టాప్‌లో పిన్ చేసి పెట్టుకోండి.


ప్రస్తుతం ఈ ఫీచర్ అందరికీ ఇంకా అందుబాటులోకి రాలేదు. దీని గురించి వాట్సప్ రోల్ అవుట్ చేస్తోంది. కాబట్టి యూజర్లందరికీ త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.


ఇక వాట్సప్ ఇటీవల మరిన్ని ఫీచర్స్ తీసుకువచ్చింది. గ్రూప్ క్రియేట్ చేసి అందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చింది కమ్యూనిటీస్ ఫీచర్‌ని రిలీజ్ చేసి. పోల్స్ క్రియేట్ చేయడానికి పోల్స్ ఫీచర్ రిలీజ్ చేసింది. వీడియో కాల్‌లో 32 మంది ఒకేసారి పాల్గొనవచ్చు. గ్రూప్‌లో 1024 మంది సభ్యుల్ని చేర్చడానికి లిమిట్ కూడా పెంచింది. వినియోగదారుల సౌకర్యార్ధం వాట్సప్‌లో కొత్త కొత్త ఫీచర్లు వస్తున్నాయి. 

Tags:    

Similar News