బీఆర్‌ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్. రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారని ఆరోపించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా వర్నిలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో కాసాని పాల్గొన్నారు. ఎన్టీఆర్ హయాంలో బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెచ్చారన్నారు. విజన్ 2020 ద్వారా అభివృద్ధి పనుల్లో చంద్రబాబు ముందు చూపుతో వ్యవహరించారని కొనియాడారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తెస్తామంటున్నారు కాసాని జ్ఞానేశ్వర్.