TSPSC Paper Leak: మరో 13 మంది డిబార్
TSPSC పేపర్ లీకేజీ కేసులో మరో 13 మంది డిబార్ అయ్యారు. భవిష్యత్‌లో నిర్వహించే పరీక్షలు రాయకుండా వీరిని డిబార్;
TSPSC పేపర్ లీకేజీ కేసులో మరో 13 మంది డిబార్ అయ్యారు. భవిష్యత్‌లో నిర్వహించే పరీక్షలు రాయకుండా వీరిని డిబార్ చేయాలని కమిషన్ నిర్ణయించింది. దీనిపై అభ్యంతరాలుంటే రెండ్రోజుల్లో వివరణ ఇవ్వాలని తెలిపింది. SITఇప్పటివరకు అరెస్ట్ చేసిన 37 మందిని మంగళవారం డిబార్ చేసింది. తమ నోటిఫికేషన్‌లోని నిబంధనలను అనుసరించి లీకేజీ కేసులో ప్రమేయమున్న వారు భవిష్యత్తులో TSPSC పరీక్షలు రాయకుండా నిషేధం విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 50 మంది డిబార్ అయ్యారు.