Bhatti Vikramarka : తెలంగాణలో 168 ఎనర్జీ క్లబ్స్... భట్టి ప్రకటన

Update: 2024-12-14 10:15 GMT

గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర పునరుత్పత్తి విద్యుత్ అభివృద్ధి సంస్థ అధికారులు రూపొందించిన విద్యుత్ పొదుపు క్యాలెండర్-2025ను ప్రగతిభవన్లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ... ఈ నెల 14 నుంచి 20 వరకు నిర్వహించనున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా తెలంగాణలో విద్యుత్ పొదుపు వేడుకలు జరగనున్నట్లు చెప్పారు. 2035 నాటికి 40 గిగావాట్ల పునరు త్పత్తి విద్యుత్ స్థాపన లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోందని తెలిపారు. విద్యుత్ సంరక్షణ మీద విద్యార్థుల్లో చైతన్యం కల్పించేందుకు 168 ఎనర్జీ క్లబ్ లు ఏర్పాటు చేశామన్నారు. ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ అమలులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని వెల్లడించారు. రాష్ట్రం మూడుసార్లు జాతీయ విద్యుత్ పొదుపు అవార్డులు అందుకుందని పేర్కొన్నారు.

Tags:    

Similar News