Red Sandalwood: శ్రీకాళహస్తిలో ఎర్రచందనం
10 లక్షలు విలువచేసే 17 ఎర్రచందనం దుంగలు స్వా ధీనం..;
శ్రీకాళహస్తి అటవీశాఖ అధికారులు ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు.. అధికారులకు ముందస్తు సమాచారంరావడంతో నిన్న రాత్రి శ్రీకాళహస్తి శివారులోని రాజీవ్ నగర్ ప్రాంతంవద్ద పోలీసులు గస్తి నిర్వహించారు.. ఆ సమయంలో అనుమానస్పదంగా వస్తున్న మహేంద్ర జైలో వాహనాన్ని తనిఖీలు చేయగా, అందులో 10 లక్షలు విలువచేసే 17 ఎర్రచందనం దుంగలును స్వా ధీనం చేసుకొని, వాహనాన్ని నడుపుతున్న గుమ్మడిపూడి చెందిన మోహన్ అరివి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ ఎర్రచందనం దుంగలు కేవీబీపురం పంచాయతీలోని కాట్రపల్లి నుంచి వస్తున్నట్లు సమాచారం. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నామన్నారు ఫారెస్ట్ అధికారులు.. తలకోన భాకరాపేట అడవి ప్రాంతంలో ఇదేవిధంగా ముందస్తు సమాచారం ఉందని.. అక్కడ ఇప్పటికే పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నా రని తెలియజేశారు. ఇకపై రోడ్లపై గస్తీలు కాకుండా, అటవీ ప్రాంతంలో దాదాపు కొంతమంది పోలీసులతో వారానికి రెండురోజులు ఎక్కడిక్కడ ఎర్రచందనం తరలిస్తున్నా రని సమాచారం ఉందో, ఆ ప్రాంతాలను గుర్తించి కూంబింగ్ నిర్వహించే విధంగా కార్యా చరణ చేపడుతున్నా మని తెలియజేశారు.