Indiramma Canteen : హైదరాబాద్‌లో కొత్తగా 2 ఇందిరమ్మ క్యాంటీన్లు

Update: 2025-09-29 08:30 GMT

హైదరాబాద్ లో ఐదు రూపాయలకే భోజనం అందించే మరో రెండు ఇందిరమ్మ క్యాంటీన్లు నేడు ప్రారంభం కానున్నాయి. మోతినగర్, ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్ లో ఏర్పాటుకానున్న క్యాంటీన్లను... రవాణాశాఖమంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మీ ప్రారంభించనున్నారు. కొత్త క్యాంటీన్లలో ఆధునిక ఫుడ్ కంటైనర్లు, సీటింగ్ , ఆర్వో తాగునీరు, వాష్ బేసిన్ , డ్రైనేజీ వంటి వసతులు ఉన్నాయి. G.H.M.C పరిధిలో ప్రస్తుతం 150 ఇందిరమ్మ క్యాంటీన్లు నడుస్తుండగా...సగటున రోజుకు 30వేల మంది లబ్ధిపొందుతున్నారు. త్వరలో అల్పహారం అందించనున్నట్లు...G.H.M.C వర్గాలు తెలిపాయి..

Tags:    

Similar News