ఆర్టీసీలో 3,038 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పారు. పోస్టుల భర్తీతో ఉద్యోగులు, కార్మికులపై పనిభారం తగ్గుతుందని తెలిపారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. సంస్థ ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందని చెప్పారు. ‘‘కొత్తగా భర్తీ చేయనున్న పోస్టులకు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాం. సంస్థలోని ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉంది. కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, రాజశేఖర్, ఖుస్రోషా ఖాన్, వెంకన్న, జాయింట్ డైరెక్టర్లు నర్మద, ఉషాదేవి, రంగారెడ్డి జిల్లా రీజినల్ మేనేజర్ శ్రీలత, ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం నేతలు పాల్గొన్నారు.