వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానంలో ఉపఎన్నికకు 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియగా 11 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈ స్థానంలో ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. బ్యాలెట్ పేపర్ ద్వారా ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. 605 పోలింగ్ కేంద్రాల్లో 4.63 లక్షల మంది ఓటర్లున్నారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడంతో ఖాళీ అయిన స్థానానికి ఈ ఉప ఎన్నిక జరగనుంది.
2021 మార్చిలో ఈ స్థానానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. పదవీకాలం మార్చి 2027 వరకు ఉంది. అయితే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో డిసెంబరు 9న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి.. ఖాళీ అయిన నాటి నుంచి ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించాలన్నది నిబంధన. దీంతో ఈసీ మే 27న పోలింగ్ తేదీని ప్రకటించింది.