Sheep Distribution Scam : గొర్రెల పంపిణీ స్కామ్ లో భారీ ట్విస్ట్

Update: 2024-06-01 07:15 GMT

రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల పంపిణీ స్కాం 700 కోట్లుగా గుర్తించారు అధికారులు. 700 కోట్ల పైచిలుకు స్కామ్ జరిగిందని అనుమానిస్తున్నారు ఏసీబీ అధికారులు. 700 కోట్ల రూపాయలు మొత్తం కూడా బ్రోకర్స్, అధికారులే పెద్ద ఎత్తున కొట్టేసారా అని అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

స్కామ్ లో కిందిస్థాయి అధికారుల నుంచి పై స్థాయి అధికారుల పాత్రపై ఏసీబీ విచారణ చేస్తోంది. రంగారెడ్డి జిల్లాలో జరిగిన స్కాముని వెలికితీయగా భారీ అవినీతి బయటపడినట్టు తెలుస్తోంది.

తాజాగా పశుసంవర్ధక శాఖ శాఖ సీఈవో రామచంద్రర్ తో పాటు ఓఎస్డీలను అరెస్టు చేసింది ఏసీబీ. ఉన్నతాధికారుల పాత్రపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తోంది ఏసిబి. త్వరలోనే దర్యాప్తు వివరాలు వెల్లడించనుంది.

Tags:    

Similar News