TG : ఏసీబీకి చిక్కిన డీటీఓ .. రూ.22వేల లంచం తీసుకుంటుండగా పట్టివేత

Update: 2025-08-07 15:15 GMT

డీటీఓ బానోతు బద్రునాయక్ లంచం తీసుకుంటూ ఇవాళ ఏసీబీకి చిక్కాడు. రూ.22 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కోరుట్లకు చెందిన శశిధర్కు చెందిన జేసీబీకి సరైన పత్రాలు లేవని డీటీఓ దానిని సీజ్ చేశాడు. దానిని తిరిగి ఇవ్వడానికి రూ.40వేల లంచం డిమాండ్ చేశాడు. అయితే రూ.35వేలకు బేరం కుదుర్చుకున్న జేసీబీ ఓనర్ శశిధర్ అదేరోజు డీటీఓ డ్రైవర్ ద్వారా రూ.13వేలు ఇచ్చాడు. మిగతా రూ.22వేలు ఇవ్వాలని వేధిస్తుండడంతో శశిధర్ ఏసీబీ అధి కారులకు ఫిర్యాదు చేశాడు. ఇవాళ మిగతా డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి డీటీఓను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా రు. డీటీఓపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపనునట్లు ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు.

Tags:    

Similar News