ACB Raids : Rto ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు

Update: 2025-06-26 17:15 GMT

ఉప్పల్ RTO ఆఫీస్‌లో ఏసీబీ సోదాలు

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయం, లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

గురువారం కరీంనగర్ ఏసీబీ (ACB) డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు జిల్లా కేంద్రంలోని జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి, వెహికల్ ఇన్ స్పెక్టర్ కార్యాలయాలను అదుపులోకి తీసుకొని సోదాలు నిర్వహిస్తున్నారు. బయటి వారిని లోనికి, లోపల ఉన్న వారిని బయటికి వెళ్లకుండా తాళాలు వేసి సోదాలు నిర్వహిస్తున్నారు.

పక్కా సమాచారం మేరకు ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News