Akkineni Akhil : కొండా సురేఖను వదిలేది లేదు: అఖిల్ వార్నింగ్

Update: 2024-10-04 14:00 GMT

మంత్రి సురేఖను వదిలేది లేదని నటుడు అఖిల్ వార్నింగ్ ఇచ్చారు. ‘కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నిరాధారం, హాస్యాస్పదం, అసభ్యకరం, జుగుప్సాకరం. సామాజిక విలువలు, సంక్షేమాన్ని మరచిపోవాలని నిర్ణయించుకుంది. ఆమె ప్రవర్తన సిగ్గుచేటు, క్షమించరానిది. అమాయకులపై సిగ్గు లేకుండా దాడి చేసి బలిపశువులను చేసింది. బాధిత కుటుంబ సభ్యుడిగా నేను మౌనంగా ఉండను. ఈ సమాజంలో అలాంటి వాళ్లకు స్థానం లేదు’ అని అఖిల్ ట్వీట్ చేశారు.

నటి సమంత విడాకులు తీసుకోవడంలో తన ప్రమేయం ఉందంటూ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై నాగార్జున కోర్టుకు వెళ్లారు. నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. మంత్రి తన కుటుంబసభ్యుల పరువుకు భంగం కలిగించారని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని దావాలో పేర్కొన్నారు.

ఎవరైనా పరువుకు భంగం కలిగిస్తే దానిపై కోర్టులో పరువునష్టం దావా వేయవచ్చు. నేరం రుజువైతే 2 సంవత్సరాల వరకు సాధారణ జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. IPC సెక్షన్ 500 ప్రకారం ఈ శిక్షలుంటాయి. గతంలో మోదీ పేరుపై చేసిన కామెంట్స్‌కు గానూ రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. అయితే దానిపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. ఇటీవల శివసేన నేత సంజయ్ రౌత్‌కు 15రోజుల జైలు శిక్ష పడింది.

Tags:    

Similar News