Allam Padma: తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ భార్య కన్నుమూత..
Allam Padma: తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ భార్య పద్మ కన్నుమూశారు.;
Allam Padma: తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ భార్య పద్మ కన్నుమూశారు. 20 రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 24ఏళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో పద్మ జీవన్మరణ పోరాటం చేశారు. అయినా కూడా మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. మహిళా జేఏసీలో చురుకైన పాత్ర పోషించారు. ఉస్మానియా విద్యార్థుల ఆకలి తీర్చి.. అమ్మల సంఘం అధ్యక్షురాలిగా కొనసాగారు. అల్లం పద్మ మృతిపట్ల ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.