Karimnagar: కరీంనగర్‌లో ప్రమాదం.. వ్యక్తి దవడ నుంచి తలలోకి దూసుకెళ్లిన ఇనుప చువ్వ..
Karimnagar: ప్రమాదవశాత్తూ ఇనుప చువ్వ ఓ వ్యక్తి తలలోకి దిగిపోయిన ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో జరిగింది.;
Karimnagar: ప్రమాదవశాత్తూ ఇనుప చువ్వ ఓ వ్యక్తి తలలోకి దిగిపోయిన ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో జరిగింది. కాల్వ నిర్మాణ పనుల్లో భాగంగా అక్కడ పనిచేస్తున్న కార్మికుడు పట్టుతప్పి పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు కనిపిస్తోంది. అతన్ని కాపాడేందుకు తోటివాళ్లంతా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇనుప కట్టర్‌తో కల్వర్టు రాడ్‌ను కట్ చేసి వెంటనే అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. దవడ భాగంలో గుచ్చుకున్న ఇనుపరాడ్ బుర్రను చీల్చుకుంటూ రెండుగుల మేర బయటకు వచ్చేయడంతో.. దాన్ని తొలగించేందుకు ఆపరేషన్ చేస్తున్నారు. పేషెంట్ కండిషన్ సీరియస్‌గానే ఉందంటున్నారు వైద్యులు.