Yadadri: యాదాద్రి కొండపై దారుణం.. సమయానికి వైద్యం అందక వృద్ధురాలు మృతి..
Yadadri: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి కొండపై దారుణం జరిగింది. కనీస సౌకర్యాలు లేకపోవడం ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది.;
Yadadri: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి కొండపై దారుణం జరిగింది. కనీస సౌకర్యాలు లేకపోవడం ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది. లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కోసం షాద్ నగర్ నుంచి 85ఏళ్ల వృద్ధురాలు వచ్చింది. దర్శనం అనంతరం సొమ్మసిల్లి పడిపోయింది. అక్కడే ఉన్నాళ్లు వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. కానీ అంబులెన్స్ వచ్చే సరికే వృద్ధురాలు చనిపోయింది.
కొండపైన కనీస వైద్య సేవలు లేకపోవడం వల్లే వృద్ధురాలు చనిపోయిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక చికిత్స చేసేవాళ్లు కూడా లేకపోవడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయన్నారు. కోట్ల రూపాయలు పెట్టి ఆలయాన్ని అభివృద్ధి చేసిన ప్రభుత్వం.. భక్తుల ప్రాణాలను గాలికొదిలేయడంపై మండిపడుతున్నారు.