నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో BJPకి కొత్త టెన్షన్..
నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో BJPకి కొత్త టెన్షన్ పట్టుకుంది. నివేదితను బుజ్జగించినా రెబల్‌గా పోటీ చేసేందుకు అంజయ్య యాదవ్ సిద్ధమైనట్టు తెలుస్తోంది.;
నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో BJPకి కొత్త టెన్షన్ పట్టుకుంది. నివేదితను బుజ్జగించినా రెబల్‌గా పోటీ చేసేందుకు అంజయ్య యాదవ్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇవాళ BJP అభ్యర్థి రవి నాయక్ నామినేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజాసింగ్ సహా మరికొందరు ముఖ్యనేతలు హాజరవుతున్నారు. అటు, పార్టీ హైకమాండ్ బుజ్జగింపుతో నామినేషన్ విత్‌డ్రాకి నివేదిత అంగీకరించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని.. పోటీ నుంచి తప్పుకుంటానని నివేదిత అన్నారు. ఐతే.. అంజయ్య యాదవ్ అలక వీడకపోవడంతో ఆయనకు నచ్చ చెప్పేందుకు BJP పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు.