TG : హైదరాబాద్ నుంచి మరో వందేభారత్ రైలు.. నాగ్‌పూర్ రూట్‌కు గుడ్ న్యూస్
తెలంగాణ నుంచి మరో వందేభారత్ రైలు ప్రారంభం కానుంది. ఇప్పటికే నాలుగు వందేభారత్ రైళ్లు సేవలందిస్తుండగా.. ఐదో వందే భారత్ రైలును ప్రవేశపెట్టేందుకు భారత రైల్వే ప్రణాళికలు సిద్ధం చేసింది. కొత్త వందేభారత్ రైలు ఈ నెల 15 నుంచి నాగ్ పూర్- సికింద్రాబాద్ మధ్య పరుగులు పెట్టనుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ఈ రైలు ప్రారంభించనున్నారు.
నాగ్ పూర్ - సికింద్రాబాద్ మధ్యరైలును ఈ నెల 15న రైలును ప్రారంభించనున్నారు ప్రధాని. ఈ రెండు నగరాల మధ్యన ఉన్న 578 కి.మీ.ల దూరాన్ని కేవలం 7 గంటల 15 నిమిషాల్లోనే చేరుకునే అవకాశమున్నట్టు రైల్వే
అధికారులు చెబుతున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ రైలు నాగూర్ లో ఉదయం 5 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 12గం. 15 నిముషాలకు సికింద్రాబాద్ చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 1 గం.లకు సికింద్రాబాద్లో బయల్దేరి రాత్రి 8 గం.ల 20ని.లకు నాగ్ పూర్ చేరుకోనుంది. కాజీపేట్, రామగుండం, బల్లార్షా, చంద్రపూర్, సేవాగ్రామ్ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.