TG : అక్టోబర్‌ నుంచి కొత్త రేషన్‌ కార్డులకు దరఖాస్తులు : మంత్రి ఉత్తమ్‌

Update: 2024-09-17 10:30 GMT

రాష్ట్రంలో అక్టోబర్‌ నుంచి కొత్త రేషన్‌ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చెప్పారు. సోమవారం జలసౌధలో కొత్త రేషన్‌కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా కొత్త రేషను కార్డులు, హెల్త్ కార్డుల జారీ, దరఖాస్తులను ఆహ్వానించడం, అర్హతలను నిర్ణయించడం, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, కార్డులను జారీ చేయడానికి విధివిధానాలను ఖరారు చేయడం వంటి అంశాలపై కమిటీ చర్చించింది. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కుమార్ రెడ్డి.. ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయని చెప్పారు. కొత్తగా రేషన్‌కార్డులు, హెల్త్‌కార్డులు విడివిడిగా అందజేస్తామన్నారు. రేషన్‌కార్డుల జారీకి సంబంధించిన తుది ప్రక్రియ నెలాఖరులోగా పూర్తి చేస్తామని చెప్పారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్‌కార్డులు, హెల్త్‌కార్డులు ఇస్తామని తెలిపారు. అర్హతలను ఫైనల్ చేయడానికి త్వరలోనే మరోసారి సమావేశమవుతామని తెలిపారు. ఈ రెండూ స్మార్ట్ కార్డు రూపంలోనే ఉంటాయన్నారు. రేషను కార్డులు కేవలం పౌర సరఫరాల దుకాణాల నుంచి రేషను వస్తువులు అందుకోడానికి మాత్రమేనని, ఆరోగ్య చికిత్సల కోసం విడిగా హెల్త్ కార్డులను ఇస్తామన్నారు. వైట్ రేషను కార్డు, హెల్త్ కార్డు స్మార్ట్ కార్డు రూపంలోనే జారీ చేస్తామని చెప్పారు.

Tags:    

Similar News