ప్రముఖ జర్నలిస్ట్‌ అరుణ్‌ సాగర్‌ విశిష్ట పురస్కారాలు

అరుణ్‌ సాగర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అరుణ్‌ సాగర్‌ జయంతి కార్యక్రమం

Update: 2021-01-02 07:12 GMT

ప్రముఖ జర్నలిస్ట్‌ అరుణ్‌ సాగర్‌ విశిష్ట పురస్కారాలు నేడు ప్రదానం చేయనున్నారు. అరుణ్‌ సాగర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అరుణ్‌ సాగర్‌ జయంతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సాక్షి దినపత్రిక ఎడిటర్‌ వర్దెల్లి మురళి, ప్రముఖ కవి ప్రొఫెసర్‌ ఎండ్లూరి సుధాకర్‌, ప్రముఖ న్యాయ కోవిధుడు ప్రొఫెసర్ మాడభూషి శ్రీధరాచార్యులుకు పురస్కారాలు అందచేస్తారు.

అరుణ్‌ సాగర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. సమావేశంలో నేరుగా హాజరు కాలేని వారు.. జూమ్‌ ఐడీ 9133345314, పాస్‌వర్డ్‌ 123456 ద్వారా పాల్గొనవచ్చని అరుణ్‌ సాగర్‌ ట్రస్ట్‌ తెలిపింది. తెలంగాణ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా సరస్వతీ సమ్మాన్‌ పురస్కార గ్రహీత కె.శివారెడ్డి, ప్రముఖ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, టీవీ-5 ఛైర్మన్‌ బి.ఆర్‌.నాయుడు హాజరు కానున్నారు.


Similar News