TG : ఇందిరాపార్క్ లో ఆటో డ్రైవర్ల ధర్నా

Update: 2024-11-05 09:30 GMT

హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ దగ్గర ఆటో డ్రైవర్లు మహాధర్నాకు పిలుపిచ్చారు. మహాలక్ష్మి పథకం వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆటోడ్రైవర్లకు నెలకు 15 వేల రూపాయలు ఇవ్వాలి కోరుతున్నారు. ఈ మహాధర్నాకు పోలీసులు పలు ఆంక్షలతో అనుమతి ఇచ్చారు. 200 మంది కన్నా ఎక్కువ పాల్గొనవద్దని..లా అండ్ ఆర్డర్ విషయంలో ఏమైనా డిస్టర్బ్ జరిగితే పర్మిషన్ క్యాన్సిల్ చేస్తామని నోటీసుల్లో కండిషన్ పెట్టారు పోలీసులు. ఈ ధర్నాకు బీఆర్‌ఎస్‌ మద్దతు తెలిపింది. ధర్నాలో కేటీఆర్‌ పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News